కమిట్ మెంట్ అంటే నీదే : 32 కి.మీ. నడిచి హీరో అయ్యాడు

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం వచ్చింది. అపాయింట్ మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. మరుసటి రోజే జాయిన్ కావాలి. ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు ఎంతో సంతోషంగా  రెడీ అయ్యాడు ఓ యువకుడు. తన కారులో కూర్చున్నాడు. ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో.. తన కాళ్లనే నమ్ముకున్నాడు. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపెనీ ఆఫీస్ కు బయల్దేరాడు. రాత్రంతా నడిచి.. మొత్తానికి అనుకున్న సమయానికే ఆఫీసుకు చేరాడు. అతని కథ విన్న కంపెనీ బాస్ ఎంతగానో ముచ్చటపడి.. అప్పటికప్పుడు ఓ కొత్త కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. అది అందుకున్న ఆ ఉద్యోగి ఎంతో సంతోషించాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

అలబామాలోని బర్మింగ్‌హామ్‌కు చెందిన వాల్టర్ కు.. ఓ మూవింగ్ కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది. ఉదయం 8 గంటల కల్లా ఆ కంపెనీ కస్టమర్ జెన్నీ లామీ దగ్గరికి అతను వెళ్లాల్సి ఉంది. సడెన్‌గా కారు పాడయింది. ఎలాగైనా అక్కడికి వెళ్లాలని నిర్ణయించిన వాల్టర్.. రాత్రంతా నడుచుకుంటూ వెళ్లాడు. మధ్యలో పెల్హామ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి అతన్ని విచారించగా.. వాల్టర్ అసలు విషయం చెప్పాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అతని కమిట్‌మెంట్‌ను మెచ్చుకుంటూ తీసుకెళ్లి బ్రేక్‌ ఫాస్ట్ చేయించాడు. ఆ తర్వాత కస్టమర్ జెన్నీ లామీ ఇంటికి ఆ పోలీస్ అధికారే అతన్ని తీసుకెళ్లాడు.

ఉదయం 8 గంటల కల్లా తమ ప్రతినిధి వస్తాడని కంపెనీ చెప్పగా.. ఉదయం 6.30 గంటలకే అతడు అక్కడికి చేరుకున్నాడు. ఆ పోలీస్ అధికారే.. వాల్టర్ ఎలా వచ్చాడో లామీకి చెప్పాడు. ఆమె అతని స్టోరీని తన ఫేస్‌బుక్  పోస్ట్ చేసింది. మాకు సాయం చేయడానికి అతను హోమ్‌వుడ్ నుంచి పెల్హామ్ వరకు నడుచుకుంటూ వచ్చాడు అని. అంతసేపు నడిచావు కదా.. కాసేపు రెస్ట్ తీసుకోమన్నా అతను తీసుకోలేదు.. వెంటనే ఇంట్లో సామాను తరలించే పని మొదలుపెట్టాడని తెలిపింది. ఆ పని చేస్తూ చిన్నతనం నుంచీ తాను పడిన కష్టాలను తనకు వాల్టర్  వివరించాడని లామీ చెప్పుకొచ్చింది.

అతని స్టోరీ తెలుసుకున్న కంపెనీ సీఈవో ల్యూక్ మార్క్‌లిన్.. కొత్త ఉద్యోగి వాల్టర్ కు కలవడానికి ప్రత్యేకంగా వచ్చాడు. అతనితో కప్పు కాఫీ తాగిన తర్వాత.. ఓ కొత్త కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆనందంతో తన బాస్‌ను గట్టిగా హత్తుకున్నాడు వాల్టర్. ఆ తర్వాత తన స్టోరీని పోస్ట్ చేసిన లామీకి కృతజ్ఞతలు చెప్పాడు. గ్రాడ్యుయేషన్ చేయాలని అనుకుంటున్న వాల్టర్.. భవిష్యత్ లో అమెరికా మెరైన్స్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates