కమ్మేసిన పొగమంచు….శంషాబాద్ లో విమాన రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాలను శుక్రవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. దీంతో రహదారులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నాయి. రోడ్డు సరిగ్గా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేకువ జాము నుంచి కురుస్తున్న పొగమంచు కారణంగా శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్  నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Posted in Uncategorized

Latest Updates