కరాటే చాంపియన్ తో పెట్టుకొని కటాకటాల పాలైన కానిస్టేబుల్

PCకరాటే ఛాంపియన్‌ తో పెట్టుకుని కటకటాల పాలయ్యాడు ఓ ట్రాఫిక్  కానిస్టేబుల్‌. తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్ కి ఓ కరాటే చాంపియన్ బుద్ది చెప్పిన ఘటన హర్యాన రాష్ట్రంలోని రోహతక్‌ లో జరిగింది.

నేషనల్ లెవల్ కరాటే చాంపియన్ అయిన 21 ఏళ్ల యువతి గురువారం(ఏప్రిల్-5)న కరాటే క్లాస్‌ ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో అదే ఆటోలో యాసిన్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కాడు. ఫోన్‌ నంబరు ఇవ్వమని, ఫ్రెండ్స్ గా ఉందామని ఆ యువతిని వేధించాడు. అయితే అందుకు ఆ యువతి నిరాకరించడంతో ఆమెను అభ్యతరకరంగా తాకడం మొదలు పెట్టాడు. దీంతో ఆత్మరక్షణ కోసం అతడిపై తన విశ్వరూపాన్ని చూపించింది ఆ యువతి. తనతో అసభ్యంగా ప్రవర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించింది. అయితే అక్కడి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కేసు రిజిస్టర్ చేయకుండా తననే రాజీ చేసేందుకు ప్రయత్నించారని ఆ యువతి ఆరోపించింది. దీంతో విషయం తెలుసుకున్న రోహతక్‌ SP పంకజ్ నాయర్ వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. మహిళా SHOను బదిలీ చేశారు. యువతిపై వేధింపులకు పాల్పడిన యాసిన్‌ ను అరెస్ట్‌ చేశామని, అతడిని విధుల నుంచి సస్పెండ్‌ చేశామని సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్ రమేష్‌ కుమార్‌ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates