కరీంనగర్‌ను లండన్‌లా తయారు చేస్తాం: సీఎం కేసీఆర్

cmkcrకరీంనగర్‌ జిల్లాను తప్పకుండా లండన్‌లా చేసి తీరుతామన్నారు సీఎం కేసీఆర్.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కిషన్‌రెడ్డి అవగాహనతో మాట్లాడాలని సీఎం సూచించారు. మేము చెప్పనివి చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్ష సభ్యులకు  సూచించారు. వరంగల్‌ను సింగపూర్ చేస్తామని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. మేం చెప్పనివి చెప్పకూడదని.. కరీంనగర్ లండన్ తప్పకుండా అవుతుందన్నారు. లోయర్ మానేర్ డ్యాం కింద 90 కిలోమీటర్ల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రూ. 500 కోట్లతో కరీంనగర్‌కు టూరిజం ప్యాకేజీ ఇచ్చామన్నారు. లండన్‌లోని థేమ్స్ నది లాగే లోయర్ మానేరు డ్యాం కింద సుందరీకరణ చేస్తామన్నారు. గోదావరిని 365 రోజులు సజీవంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates