కరీంనగర్‌-తిరుపతికి వారానికి 4 రైళ్లు

కరీంనగర్‌-తిరుపతి రైలును వారంలో నాలుగుసార్లు నడిపేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కరీంనగర్ ఎంపీ వినోద్ తెలుపుతూ .. సంతోషం వ్యక్తం చేశారు. శనివారం డిసెంబర్-15న సికింద్రాబాద్‌ రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ గుప్తాతో సమావేశమైన తర్వాత.. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. కరీంనగర్‌ ప్రజల కోరిక మేరకు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కరీంనగర్‌ పరిధిలోని తీగలగుట్టపల్లిలో గల లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రూ.102కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి  రైల్వే బోర్డు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి నూతన మార్గంలో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 2019 మార్చి 21వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు రైల్వేశాఖ నిర్ణయించిందని తెలిపారు ఎంపీ వినోద్.

Posted in Uncategorized

Latest Updates