కరీంనగర్ – ముంబై లోకమాన్య ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం

కరీంనగర్: నిజామాబాద్- ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలును కరీంనగర్ వరకు పొడగించారు. కొత్త రైలును కరీంనగర్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ కృషి వల్లే ట్రైన్ వచ్చిందంటూ బీజేపీ కార్యకర్తలు జెండాలు ప్రదర్శించి సంబరాలు చేసుకున్నారు.

రైలు ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఎంపీ వినోద్.. “ రాబోయే రోజుల్లో కరీంనగర్ పెద్ద రైల్వే  జంక్షన్ కాబోతోంది. హైదరాబాద్ లాగే కరీంనగర్ నుంచి కూడా దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఉండేలా రానున్న ఐదేళ్లలో కృషి చేస్తాం. ఢిల్లీ నుంచి కరీంనగర్ కు రైలు నడిచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తపల్లి -మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాజీపేట- కరీంనగర్ లైన్ సర్వే పనులు మొదలయ్యాయి”  అని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates