కరీంనగర్ లో జెండా ఊపి ఒలింపిక్ డే రన్ ప్రారంభంచిన ఈటెల

eetelaరాబోయే రోజుల్లో కరీంనగర్ ను క్రీడలకు వేదికగా తీర్చిదిద్దుతామన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ లో పదో తరగతి వరకు మాత్రమే ఉన్న స్పోర్ట్స్ స్కూల్ ను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ఒలింపిక్ డే సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ వరకు రన్ నిర్వహించారు. జెండా ఊపి రన్ ను ప్రారంభించారు ఈటల. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్ తో పాటు.. క్రీడాకారులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates