కరీంనగర్ LMDలో జెట్ స్కీ బోట్… జారిపడ్డ ఎమ్మెల్యే

కరీంనగర్ : నగరంలోని ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్, లోయర్ మానేర్ డ్యామ్ లో కొత్తగా జెట్ స్కీ బోట్ ప్రవేశపెట్టారు. కరీంనగర్ ను పర్యాటకంగా మరింత డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో… LMDకి అదనపు హంగులు జోడిస్తున్నారు. నీళ్లలో జామ్ జామ్మంటూ విహరించాలనుకునేవాళ్లకు… జెట్ స్కీ బోట్లను తీసుకొచ్చారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ జెట్ స్కీ బోట్లను స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా నడిపి చూశారు.

మొదటిసారి జెట్ స్కీ విహారానికి ఇద్దరు సహాయకులతో కలిసి వెళ్లారు కమలాకర్. తానే స్వయంగా స్కీ బోట్ ను నడిపారు. సరదాగా అనిపించడంతో… మరోసారి ట్రై చేశారు. ఐతే.. రెండోసారి బోట్ ఎక్కే సందర్భంలో కాలుజారి పడ్డారు. వెంటనే అతడికి సహాయం అందించారు అనుచరులు.

కరీంనగర్ పట్టణం పర్యాటకంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే కమలాకర్ చెప్పారు. ఎల్ఎండీలో ఉల్లాసంగా గడిపేందుకు ఎక్కువ మంది వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు కమలాకర్.

Posted in Uncategorized

Latest Updates