కరుణానిధిని పరామర్శించిన గవర్నర్ పురోహిత్

ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నిన్న రాత్రి కావేరీ ఆసుపత్రిలో చేరిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధిని పరామర్శించారు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్. వైద్యులనడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కాగా, బ్లడ్ ప్రషర్ పడిపోవడంతో వెంటనే వైద్య చికిత్స అందించామని, రక్తపోటు నిలకడగా ఉందని బులిటెన్ విడుదల చేశారు ఆసుపత్రి వైద్యులు. తమ ప్రియతమ నేతను కావేరీ ఆసుపత్రిలో చేర్చారన్న వార్తతో అభిమానులు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలి వచ్చారు. దీంతో ఆసుపత్రి వెలుపల భారీ పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, కరుణానిధి రక్తపోటు అదుపులోని ఉందని, ప్రమాదం తప్పిందన్నారు డీఎంకే నేత ఎ.రాజా.

 

 

Posted in Uncategorized

Latest Updates