కరుణానిధిని పరామర్శించిన వెంకయ్య

కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాకర్లు వెంకయ్యనాయుడుకు చెప్పారు. ఆదివారం (జూలై-29) కరుణానిదిని పరామర్శించారు వెంకయ్య. అయితే కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొలి అధికారిక ఫొటోను విడుదల చేశారు. ఆయన అధికారిక ట్విటర్ అకౌంట్‌ లోనే ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శిస్తున్న సమయంలో తీసిన ఫొటో అది. ఆయన పక్కనే తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కరుణానిధి తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కూతురు కనిమొళి ఉన్నారు. చెన్నైలోని ఆల్వార్‌ పేట్ కావేరీ హాస్పిటల్ ఐసీయూలోని ఫొటో ఇది. శనివారం రాత్రి ఆయన ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరుణానిధి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Posted in Uncategorized

Latest Updates