కరుణానిధిని పరామర్శిస్తున్న నేతలు : ఇంట్లోనే  డాక్టర్లతో వైద్య పరీక్షలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ఆయన జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్లు.. ఇంట్లోనే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఇక.. కరుణానిది ఆనారోగ్యంతో ఉన్నారన్న వార్తలతో.. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ తో పాటు పలువురు నేతలు.. ఇప్పటికే కరుణానిధిని పరామర్శించారు. శుక్రవారం (జూలై-27) డీఎంకే నేతలతో పాటు.. డీఎండీకే చీఫ్ వైగో.. కరునానిధి నివాసానికి వచ్చారు.

కరుణానిధి త్వరలోనే మళ్లీ ప్రజలతో మాట్లాడతారన్నారు డీఎండీకే చీఫ్ వైకో. చెన్నై గోపాలపురంలోని నివాసానికి వెళ్లిన ఆయన..  కరుణానిధిని పరామర్శించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతోందన్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తారని చెప్పారు. అలాగే తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ కూడా కరుణానిధి నివాసానికి వెళ్లి.. కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates