కరుణానిధి కోలుకుంటున్నారు : తమిళ సీఎం పళనిస్వామి

కరుణానిధి కోలుకుంటున్నారని తమిళనాడు సీఎం పళనిస్వామి వెల్లడించారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి తిరిగొస్తారని స్పష్టం చేశారాయన. కలైంజర్ ఆరోగ్యం విషమంగా ఉందన్న సమాచారంతో.. తన పర్యటనలన్నింటినీ అర్థాంతరంగా రద్దు చేసుకుని చెన్నై చేరుకున్నారు సీఎం. అర్థరాత్రే ఆయన కరుణానిధిని కలవాల్సి ఉన్నా.. హాస్పిటల్ ముందు అభిమానుల హడావిడి, లాఠీచార్జ్, ఉద్రిక్త వాతావరణం కారణంగా విరమించుకున్నారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలో ఆయన్ను పరామర్శించారు. విదేశాల నుంచి వచ్చిన వైద్యుల సమక్షంలో ఆయనకు చికిత్స జరుగుతుందన్నారు. సీఎం వెంట పన్నీరుసెల్వం, ఇతర మంత్రులు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates