కరుణించండి మహాప్రభో : సమాధుల రూపంలో రైతుల నిరసన

tamil

ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు తమిళనాడు రైతులు. మొన్నటి వరకు పంట నష్టపరిహారంపై ఢిల్లీలో సైతం కదంతొక్కారు. ఇప్పుడు కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వివిధ రూపాల్లో, వింత పద్దతుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 6వ తేదీ శుక్రవారం తిరుచ్చి ప్రాంతంలోని రైతులు తమకు తాము పూడ్చిపెట్టుకున్నారు.

కావేరీ నది ఒడ్డున.. ఇసుకలో సమాధుల రూపంలో పడుకుని నిరసనకి దిగారు. నది ఒడ్డున గోతులు తీసి.. అందులో పడుకున్నారు. తల ఒక్కటే బయటకు కనిపించే విధంగా.. నుదిటను బొట్టు పెట్టుకున్నారు. మెడలో దండలు వేసుకున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అచ్చం సమాధుల రూపంలో నిరసన చేపట్టారు రైతులు.

 

Posted in Uncategorized

Latest Updates