కరెంట్ కట్: నిలిచిపోయిన మెట్రో

హైదరాబాద్ : మియాపూర్‌- అమీర్‌ పేట్‌ మెట్రో రైలులో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడింది. దీంతో ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్‌ పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ బాలానగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. మెట్రో పవర్‌ ప్లాంట్‌లో సమస్య రావడంతో  రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులు మాత్రం విద్యుత్‌ అంతరాయం కారణంగానే రైలు  దారి మధ్యలో ఆగిపోయిందని ఆరోపిస్తున్నారు. దీంతో మియాపూర్‌ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి.  ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొన్నారు ప్రయాణికులు.

వెంటనే అలర్టైన మెట్రో సిబ్బంది మరమ్మతు చర్యలు చేపట్టారు. మరమ్మతులు పూర్తయ్యేవరకూ మియాపూర్‌ నుంచి బాలానగర్‌ వరకూ మెట్రోరైలు సేవలను అధికారులు నిలిపివేశారు. ఎర్రగడ్డ నుంచి అమీర్‌పేట వరకూ రైళ్లు నడవనున్నట్లు తెలిపారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates