కరోనా ఎఫెక్ట్.. ప్లాస్టిక్ చుట్టుకుని ఫ్లైట్ లో..

కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుంది. ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాల ఎకానమి పడిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వైరస్ సోకకుండా పలు దేశాలు జాగ్రత్తలు పాటిస్తుంది. ఇక ఎవరికి తోచినట్టుగా వారు కేర్ తీసుకుంటున్నారు. ముక్కులకు మాస్క్ లు ధరించడం వంటివి చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ భయానికి  ఇద్దరు ప్రయాణికులు ఫ్లైట్ లో బాడీ మొత్తాన్ని ప్లాస్టిక్ షీట్లతో చుట్టుకున్నారు. ఊపిరి పీల్చుకోవడానికి వారు హుడ్స్ , ఆర్మ్‌హోల్స్‌ను కూడా ఉపయోగించారు.  ఈ సంఘటనను వారి ముందున్న వారు వీడియో తీశారు.  అలిస్సా అనే అమ్మాయి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్లాస్టిక్ షీట్లు ధరించిన వాళ్లు నిద్రపోతున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ప్రభావం అలాంటిదని కొందరు..ఎవరి జాగ్రత్త వారిదని మరికొందరు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

see more news

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కు పాక్‌ సిటిజన్‌ షిప్‌

పేపర్ మిల్లులో ప్రమాదం..ముగ్గురు కార్మికులు మృతి

Latest Updates