కరోనా నిర్లక్ష్యంలో కేసీఆర్ నెంబర్ వన్ సీఎం: మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు దేశంలో నేనే నంబర్ వన్…  నేనే నెంబర్ వన్.. అని చెప్పుకుంటాడు… నిజమే దేశ వ్యాప్తంగా అవినీతిలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు అంటే కెసిఆరే అనే పేరు వచ్చింది… ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా ఆయనే నెంబర్ వన్ లో ఉన్నాడని పేరొచ్చిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు. బీజేపీ ముఖ్య నాయకులతో జూమ్ ద్వారా మాట్లాడిన ఆయన కేసీఆర్ పాలనతీరు సరిగా లేదన్నారు. ఆసుపత్రుల్లో తగినంత మంది డాక్టర్లు ఉన్నారా ? లేదా? కోవిడ్ పేషెంట్లకు వసతులు ఉన్నాయా?  లేవా? అనే విషయాలేవీ చూస్త లేడు గాని.. ఫామ్ హౌస్ లోనే ఉండి కమిషన్లు ఎలా తీసుకోవాలనే ఆలోచనే మాత్రమే చేస్తున్నాడు అని ఆరోపించారు. కెసిఆర్  నిర్లక్ష్యం కారణంగానే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో  తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి ఒక ఆలోచన వస్తుంది పొద్దున్నే దాన్ని అమలు చేస్తాడు కెసిఆర్… సెక్రటేరియట్  కూల్చివేసి.. కల్వకుంట్ల సెక్రటేరియట్ గా  మార్చుకోవాలని అనుకుంటున్నాడు.. నీకు నచ్చిన పేరు పెట్టుకో కెసిఆర్… కానీ సెక్రటేరియట్ ను కూల్చివేయకుండా కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ నుంచి వచ్చే నీళ్లను కూడా ఎత్తి పోసి కోట్లాది రూపాయల ఖర్చు చేసిండు.. 30 వేల కోట్ల ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు ఖర్చు చేసిండు… ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ పనులు పాలన పై ప్రజల్లో చర్చ జరుగుతోందని ప్రస్తావించారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ కాలువ గండి పడిందంటే ….కెసిఆర్ పనితీరు ఏ విధంగా ఉందో ఆలోచించాలన్నారు. కొండ పోచమ్మ ప్రాజెక్టు పక్కనే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది …ఫాం హౌస్ లో కూర్చొని ఉన్న కేసీఆర్ కొండ పోచమ్మకు గండి పడుతుంటే ఏం చేస్తున్నాడు ? ఫాం హౌస్ లో కూర్చోని కమీషన్ లు  తీసుకుంటున్నాడ ?  అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని  అప్పుల రాష్ట్రంగా మార్చేసిన కేసీఆర్ కరోనా కోసం ఇచ్చిన నిధులను కూడా సరిగా వాడడం లేదు… టోటల్ గా తెలంగాణా రాష్ట్రాన్ని ఫెయిల్డ్ రాష్ట్రంగా మార్చిండు.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సరిగా చెయ్! అని హెచ్చరించారు.

Latest Updates