కరోనా మనిషిని చంపే రోగం కాదు.. అందుకే కార్పోరేట్ కు వెళ్లొద్దు

కరోనా మనిషి చనిపోయే రోగం కాదని..ఎవరూ కూడా కార్పోరేట్ హాస్పత్రులకు వెళ్లొదన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించారు హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరైనా కరోనా లక్షణాలు కనబడితే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఆర్వీఎం ఆసుపత్రిలో చుట్టూ పక్కల గ్రామాల్లోని ప్రజలు వచ్చి టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. కోవిడ్ పేషంట్లకు ఆర్వీఎం ఆసుపత్రిలో చాలా వసతులను ఉచితంగా అందిస్తుందన్నారు. . ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ఆర్టిపిసిఆర్ కేంద్రాన్ని ప్రారంభిస్తుందన్నారు. త్వరలో సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఆర్టిపిసిఆర్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పుడు జిల్లాలో రాపిడ్ టెస్టులకు ఐదు వేల కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కోవిడ్ పేషంట్లకే కాదు, డాక్టర్లకు, నర్సులకు అందరికి కూడా ప్రభుత్వం రక్షణగా ఉంటదన్నారు హరీశ్ రావు.

Latest Updates