కరోనా సంక్షోభంలోనూ ధరల పెంపా?

  • పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు పై రాహుల్ ఆగ్రహం
    న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం సమయంలోనూ కేంద్రం ప్రజలను డబ్బులు పిండుకోవాలా అనే చూస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కరోనా కష్టాల సమయంలోనూ ఇలా ధరలు పెంచటం ఏమిటంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. జనం ఇబ్బందులు పడుతున్న సమయంలో ధరలు తగ్గించాల్సింది పోయి అడ్డగోలుగా పెంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డిజీల్ ధరల తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాన్ని మోడీ ప్రభుత్వం ప్రజలకు అందకుండా చేస్తోందని విమర్శించారు. పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని వెంటనే తగ్గించాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు. కరోనా కారణంగా వరల్డ్ వైడ్ గా లాక్ డౌన్ పాటించటంతో పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గింది. దీంతో రేట్లు బ్యారెల్ చమురు ధర భారీగా పతనమైంది. అందుకు అనుగుణంగా రేట్లు తగ్గించకుండా కేంద్రం పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 చొప్పున సుంకాన్ని పెంచింది. ఎక్సైజ్‌ సుంకం పెంపును చమురు కంపెనీలే భరిస్తాయని…వినియోగదారులకు ఈ భారం ఉండదని కేంద్రం తెలిపింది.

Latest Updates