కర్ణాటకను కాంగ్రెస్ నుంచి విముక్తి: మోడీ

MODIకాంగ్రెస్ నుంచి కర్ణాటకను విముక్తం చేయాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బెంగళూరులో జరిగిన పరివర్తన్ ర్యాలీలో మోడీ మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో 90 రోజుల పాటు జరిగిన నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగసభ నిర్వహించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని మోడీ చెప్పారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ను పారదోలేందుకు ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు.

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం బుజ్జగింపు, హత్యా రాజకీయాలు చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా ఈజ్ ఆఫ్ మర్డర్స్ కు సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదన్నారు మోడీ. ప్రతీ ప్రాజెక్ట్ లోనూ కాంగ్రెస్ నేతలు 10శాతం కమీషన్లు నొక్కేస్తున్నారని ఆరోపించారు మోడీ.

మరోవైపు హోంమంత్రి రాజ్ నాథ్ త్రిపురలో ఎన్నికల ప్రచారం చేశారు. రాజకీయ హత్యలకు త్రిపుర కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే… సీపీఎం కార్యకర్తలు కూడా సురక్షితంగా ఉంటారని తాను హామీ ఇస్తున్నానన్నారు రాజ్ నాథ్.

త్రిపురలో ఈ నెల 18న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates