కర్ణాటకలో అర్థరాత్రి హైడ్రామా : యడ్యూరప్ప వ్యూహాలు..ఎగరని కాంగ్రెస్ విమానాలు

KA-MLASBJP ఆపరేషన్ కమల్ నుంచి తమ MLAలను కాపాడుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్-JDS. ఎమ్మెల్యేలను కొచ్చి తరలించేందుకు రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. కొచ్చిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో MLAలు ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు స్పెషల్ ఫ్లైట్ లను కూడా బుక్ చేశాయి. విమానాలు బయల్దేరేందుకు DGCA అనుమతించలేదు. దీంతో MLAలను రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తరలించారు. అయితే ఎంత మందిని హైదరాబాద్ తరలించారు అనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు కొంత మంది MLAలు బీజేపీ గూటికి చేరినట్టు తెలుస్తోంది. లింగాయత్‌ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్టానం ఆ పార్టీ నేత శివశంకరప్పకు అప్పగించింది. గురువారం అసెంబ్లీ ముందు గొడవ చేసిన తర్వాత అందర్నీ మళ్లీ రిసార్టుకు తరలించారంటేనే ఎంతలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఎమ్మెల్యేలు, వారి సహాయకులు, హోటల్‌ సిబ్బంది ఫోన్లన్నీ తీసేసుకున్నారు. అయితే, యడ్యూరప్ప సీఎం పదవి చేపట్టాక రిసార్టు బయట పోలీసు సిబ్బందిని తొలగించేశారు. జేడీఎస్ కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలను వసంత్‌ నగర్‌ లోని సెవెన్‌ స్టార్‌ హోటల్‌ షాంగ్రి-లాలో ఉంచారు. తమ పార్టీలో ఎవరూ ఫిరాయించేవాళ్లు లేరని కుమారస్వామి ధీమాగా ఉన్నారు.

అయితే, గడువు సుదీర్ఘంగా ఉండటంతో బెంగళూరులో ఎమ్మెల్యేలను ఉంచడం మంచిది కాదని ఇరు పార్టీల పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించగా, ఇంకా జేడీఎస్‌ ఎటు వెళ్లాలనేది నిర్ణయించుకోలేదు. అంతకుముందు, కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలు ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే జేడీఎస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ కు తరలించనున్నట్లు కూడా ఊహాగానాలు వెలువడ్డాయి.

Posted in Uncategorized

Latest Updates