కర్ణాటకలో కాంగ్రెస్ టికెట్ల రగడ : మండ్యాలో పార్టీ కార్యాలయం ధ్వంసం

conge మరి కొన్ని రోజుల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్ధానాలకు గాను 218 స్ధానాలకు అభ్యర్ధుల మొదటి లిస్ట్ ను కాంగ్రెస్ ఆదివారం(ఏప్రిల్-15) మెదట విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో పలువురి కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. టికెట్లు రాని అభ్యర్ధులు తమ మద్దతు దారులతో కలసి రోడ్లెక్కారు. మండ్యా, మంగుళూరు, బెంగళూరులో తమ మద్దతుదారులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాండ్యలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. రహదారులపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ఎన్నికల్లో రెండుస్ధానాల నుంచి పోటీ చేయాలని మొదట భావించిన సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates