కర్ణాటకలో కాలా బ్యాన్ పై స్పందించిన రజనీ

RAJAకర్ణాటకలో కాలా మూవీని బ్యాన్ చేయడంపై స్పందించారు సూపర్ స్టార్ రజనీకాంత్. కర్ణాటకలో కాలా మూవీ బ్యాన్ చేయడం వెనుక ఉన్న కారణం తనకు తెలియదన్నారు. కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(KFCC) అనేది సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఓ భాగమన్నారు. తప్పకుండా వారు ఈ విషయంలో జోక్యం చేసుకొని స్కేహపూర్వక నిర్ణయానికి వస్తారని తాను నమ్ముతున్నానన్నారు. అయితే కర్ణాటకలో కాలా బ్యాన్ పై నడిగర్ సంఘం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు… కర్ణాటకలో కాలా బ్యాన్ అనే విషయం నిన్నే అందరికీ తెలిసిందనీ, త్వరలోనే దీనిపై నడిగర్ సంఘం స్పందిస్తుందన్నారు. 2017లో విడుదలైన రజనీకాంత్ కబాలి మూవీ కర్ణాటక వ్యాప్తంగా 30 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు కర్ణాటకలో కాలా బ్యాన్ కొనసాగితే ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశముంది. కావేరీ జల వివాదం సందర్భంగా రజనీ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ 10 కన్నడ సంఘూలు కన్నడ ఫిల్మ్ కౌన్సిల్ ను సంప్రదించడంతో ఈ మూవీపై బ్యాన్ విధించారు.

Posted in Uncategorized

Latest Updates