కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచింది : సీఎం చంద్రబాబు

CHANDRAఅసెంబ్లీలో బలపరీక్షకు ముందే కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనాయ చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు చంద్రబాబునాయుడు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్లందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయాలని ప్రయత్నించారన్నారు. అవినీతిపరుడైన గాలి జనార్ధన్ రెడ్డిని ముందుపెట్టి బీజేపీ రాజకీయాలు చేసిందన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తూ దేశ ప్రజలకు బీజేపీ ఏం మెసేజ్ ఇస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.

Posted in Uncategorized

Latest Updates