కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచింది…సుప్రీంకి ధన్యవాదాలు : రజనీకాంత్

rapశనివారం కర్ణాటకలో యడ్యూరప్ప సీఎంగా రాజీనామా చేయడంతో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ మహిళా విభాగం కార్యకర్తలతో ఈరోజు(మే-20) భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బలనిరూపణకు బీజేపీ సమయం అడగటం, గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ 15 రోజుల సమయం ఇచ్చారన్నారు. సరైన సమయంలో స్పందించి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినందుకు సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు రజనీకాంత్. ఇక తన రాజకీయ ఎంట్రీపై రజనీ మాట్లాడారు. ఎలక్షన్స్ ప్రకటన వెలువడిన తరువాతే2019 ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీని ఇంకా లాంచ్ చేయనప్పటికీ తాము దేనికైనా సిద్దమేనని తెలిపారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం సరైనదికాదని రజనీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates