కర్ణాటకలో లక్ష్మీ బాంబ్…ధర రూ.30 కోట్లు

ఆపరేషన్‌ లోటస్ లో భాగంగా… బీజేపీ నాయకులు తనకు 30 కోట్ల డబ్బు, మంత్రి పదవి ఆఫర్ చేశారంటూ శుక్రవారం(సెప్టెంబర్-28) సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక కాంగ్రెస్ MLA లక్ష్మీ హెబ్బాల్కర్‌.

శుక్రవారం బెళగావిలో ఆమె మాట్లాడుతూ….ఈ ఏడాది మేలో ఆపరేషన్ లోటస్ నుంచి తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడంలోభాగంగా హైదరాబాద్ లో ఉన్న సమయంలో… కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ మహిళా లీడర్ తనకు ఫోన్ చేశారని, బీజేపీలో చేరితే మంత్రి పదవితో పాటు 30 కోట్ల డబ్బును కూడా ఆఫర్ చేశారన్నారు. అయితే అందుకు తాను అంగీకరించకపోవడంతో…ఎలాగైనా నన్ను ఒప్పించాలని… ఓ కేంద్రమంత్రి నా అక్కను, కుటుంబసభ్యులతో మాట్లాడారాని తెలిపారు. ఆఫర్‌ కు సంబంధించి తన ఫోన్‌ కు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపారని, ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. అయితే తనతో సంప్రదింపులు జరిపిన నేతల పేర్లు మాత్రం ఆమె బయటపెట్టలేదు.

సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, ఎవరెన్ని కుట్రలు చేసినా 5ఏళ్లు సంకీర్ణప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతుందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates