కర్ణాటక ఎలక్షన్స్: బీజేపీ ఆఫర్ కి…నో చెప్పిన మాజీ క్రికెటర్స్

kumble-dravidకర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ఆయా పార్టీల నాయకులు ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  ‌ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నారు .ఇందులో భాగంగా కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని.. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. సెలబ్రిటీల గ్లామర్ ను కూడా పార్టీ కోసం ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. దీంతో ఆ రాష్ట్రానికే చెందిన చెందిన ఇద్దరు ప్రముఖ మాజీ క్రికెటర్లయిన అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రావిడ్‌లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లను బరిలోకి దించి ప్రచారం చేయించాలని భావిస్తోంది. అయితే వీరిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. వారిని ఎలాగైనా ఒప్పించాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోందట. వారిలో ఒకరిని రాష్ట్ర అసెంబ్లీ బరిలోకి దింపి.. మరొకరిని జాతీయ రాజకీయాల్లోకి పంపుతామని కూడా ఆఫర్‌ ఇచ్చింది. అయితే వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. కుంబ్లే, ద్రవిడ్‌తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని… కనీసం వారిలో ఒకరినైనా లోక్‌సభ లేదా రాజ్యసభ బరిలో దింపుతామంటున్నారు బీజేపీ నేతలు. ఇదే విషయంపై కుంబ్లే, ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కర్ణాటకలో  మే 12న ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం (ఏప్రిల్-17) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

 

Posted in Uncategorized

Latest Updates