కర్ణాటక తెలుగు ప్రజలు JDSకే మద్దతివ్వండి : కేసీఆర్

KCR11కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో… తెలుగు మాట్లాడే ప్రజలంతా JDS కే ఓట్లేసి గెలిపించాలని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. అంతేకాదు దేవెగౌడ, కుమార స్వామి ఆదేశిస్తే తమ పార్టీ తరుపునుంచి ప్రచారం చేయడానికి కూడా సిద్ధమన్నారు. తాము జేడీఎస్ ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం కాదు.. ప్రజల కోసమే మా ఫ్రంట్ అని అన్నారు సీఎం కేసీఆర్. శుక్రవారం(ఏప్రిల్-13) సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమయ్యాయని, 65 ఏళ్లలో పాలకులు తాగునీటిని కూడా అందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు .

Posted in Uncategorized

Latest Updates