కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా KG బోపయ్య

KGకర్ణాటక ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే KG బోపయ్య నియామకమయ్యారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ వాజుభాయ్‌ వాలా నిర్ణయం తీసుకున్నారు. ఈయన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. 2009-2013 మధ్యలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. RSS నేపథ్యం కూడా ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడు ABVPలో పనిచేశారు. 2004లో మడికెరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విరాజిపేట నుంచి 2008లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కేజీ బొపయ్య బీజేపీ అధినాయకత్వానికి నమ్మకస్తుడు. 2011లో యెడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేజీ బోపయ్య స్పీకర్ గా ఉన్నారు. ఆ సమయంలో.. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆనాడు అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్ బోపయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. ఈ నిర్ణయం అప్పట్లోనే వివాదాస్పదమైంది.  స్పీకర్ బోపయ్య తీరుపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.

Posted in Uncategorized

Latest Updates