కర్ణాటక రాజకీయం : రాజ్ భవన్ టూ సుప్రీంకోర్టు

supreme-court-karnatakaకర్ణాటక రాజకీయం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకూ రాజ్ భవన్ వేదికగా జరిగిన కన్నడ రాజకీయ పంచాయితీ ఇప్పుడు సుప్రీంకి చేరింది. గవర్నర్ బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తే సుప్రీం తలుపుతట్టేందుకు రెడీ అయ్యాయి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు. మరికొద్ది సేపట్లో గవర్నర్ ను కలవనున్నారు. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(CEO) సంజీవ్ కుమార్ గవర్నర్ వాజూభాయ్ వాలాతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై గవర్నర్ తో ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. జేడీఎస్ నేత కుమారస్వామి. ఈ రోజు ఉదయం జరిగిన జేడీఎస్ ఎల్పీ మీటింగ్ లో కుమారస్వామిని తమ నాయకుడిగా ఎన్నుకున్నామని జేడీఎస్ నేత రేవణ్ణ తెలిపారు. అయితే ఉదయం జరిగిన జేడీఎస్ ఎల్పీ మీటింగ్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates