కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

Yeddyurappa.jpg cmకర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప నేడు (గురువారం-మే-17) ప్రమాణం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌ లో ఉదయం 9 గంటలకు ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ వాజుభాయ్. ఆయన ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌ క్లియర్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్‌భవన్‌ లో ఘనంగా ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. బలనిరూపణ తర్వాత  మంత్రివర్గాన్ని నియమించే  అవకాశాలున్నాయి. బలనిరూపన గవర్నర్ 15 రోజుల టైమ్ ఇచ్చారు. అంతేకాదు గవర్నర్ నిర్ణయంపై శుక్రవారం మే-18 సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. అన్ని పూర్తయిన తర్వాతే ..మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు యడ్యూరప్ప.

Posted in Uncategorized

Latest Updates