కర్ణాటక సీఎం తో అల్పాహారం చేసిన మంత్రి కేటీఆర్

ktr-kumaraswamyబెంగళూరు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిని కలిశారు. బుధవారం(జులై-4) ఉదయం భేటీలో భాగంగా ఇద్దరూ కలిసి అల్పాహారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు సంక్షేమ కార్యక్రామాలను వివరించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాల గురించి తెలిపారు మంత్రి. సీఎం కుమారస్వామి వినయం, సాధారణంగా ఉండే తత్వం తనను ఎంతో ఆకట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates