కర్ణాటక 24వ సీఎంగా… కుమారస్వామి అనే నేను

KUMARకర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు.  డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా వీరిచేత ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం కుమారస్వామికి, పకరమేశ్వర్ కి పుష్పగుచ్చం అందించి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేస్తున్న సమయంలో విధానసౌద ఏరియా అంతా హర్షధ్వానాలతో మార్మోగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మాయావతి, చంద్రబాబు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్,సీతారాం ఏచూరి,శరద్ యాదవ్, శరద్ పవార్,జైపాల్ రెడ్డి తదితర జాతీయ నాయకులు హాజరయ్యారు.
బీజేపీయేతర పార్టీల నేతలందరూ ఒకే వేదికపైకి రావడం అందరిలోనూ ఆసక్తి పెంచింది. వేదికపై నేతలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాన్ని కూడా ఆసక్తిగా గమనించారు అక్కడి జనం. సోనియా, మాయావతి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని.. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇక రాహుల్ కూడా వేదిక మొత్తం తిరుగుతూ అందరినీ పలకరించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అందరు నేతలతో మాట్లాడటం కనిపించింది.
ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత కూడా నేతలంతా చాలాసేపు స్టేజీపైనే ఉన్నారు. అందరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. నేతలంతా కుమారస్వామిని అభినందించారు. చివర్లో కుమారస్వామి, కాంగ్రెస్ నేత శివకుమార్ కలిసి కార్యకర్తలకు అభివాదం చేశారు.


Posted in Uncategorized

Latest Updates