కర్నాటక ఎలక్షన్స్ : ట్రావెల్స్ బస్సులో రూ.కోట్లు పట్టివేత

travel-bus-moneyకర్నాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ టైంలో డబ్బు తరలింపు కూడా జోరుగా సాగుతోంది. ఏపీ రాష్ట్రం అనంతపురం నుంచి కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద అట్టపెట్టెల్లో డబ్బు కట్టలను తరలిస్తున్నారు. డబ్బు తీసుకెళుతున్న వ్యక్తి.. నగదుకి సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవటం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డబ్బుని లెక్కించగా రూ.100 కోట్లు ఉంటుందని చెబుతుండగా.. దీనిపై పక్కా సమాచారం అయితే లేదు. డబ్బు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ధృవీకరిస్తున్న కర్నాటక పోలీసులు.. ఆ సొమ్ము ఎంత అనేది మాత్రం స్పష్టంగా చెప్పటం లేదు. కర్నాటక ఎన్నికల కోసమే ఈ డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే దీని వెనక ఉన్నది ఎవరు.. ఏ పార్టీ వారు అనేది స్పష్టంగా తెలియరాలేదు.

Posted in Uncategorized

Latest Updates