కర్నాటక రాజకీయం : అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ – జేడీఎస్ ధర్నా

karnataka-assamblyకర్నాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం.. గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనబాట పట్టారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకి దిగారు. కాంగ్రెస్ సీనియర్లు గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, పరమేశ్వరన్, అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్ తోపాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ ధర్నాకి హాజరయ్యారు.

మరోవైపు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యాయపోరాటం చేస్తూనే.. ఎమ్మెల్యేల్ని కాపాడుకునే పనిలో క్యాంప్ నిర్వహిస్తున్నాయి. రెండు పార్టీల నేతలు..తమ పార్టీ ఎమ్మెల్యేల్ని రిసార్ట్ కు తరలించారు. బీజేపీ అందుబాటులో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను సైతం తీసేసుకున్నారు. బెంగళూరులోని ఈగిల్టన్ గోల్ఫ్ విలేజ్ రిసార్ట్ లో ఎమ్మెల్యేలు ప్రస్తుతం సేద తీరుతున్నారు. ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా సెక్యూరిటీ పెట్టారు. సిద్ధరామయ్య సర్కార్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన శివకుమార్ రిసార్ట్ దగ్గర పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యడ్యూరప్ప బలనిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్. ఈ రెండు వారాలు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రిసార్ట్ లోనే ఉంచనున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates