కర్నాటక రాజకీయం : రాజ్ భవన్ ఎదుట జేడీఎస్ ఆందోళన – యడ్యూరప్పకి పిలుపు

kanada
కర్నాటక రాజకీయాల్లో కీలక మలుపు. మధ్యాహ్నం వరకు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు కుమారస్వామి, పరమేశ్వరన్ రాజ్ భవన్ చేరుకున్నారు. భేటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే అపాయింట్ మెంట్ లేని కారణంగా గేటు దగ్గర కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు, ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కుమారస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మద్దతు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే గేటు దగ్గరే సిబ్బంది అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ఎదుట బల ప్రదర్శన చేశారు. పరేడ్ నిర్వహించారు. మా బలం చూడండి గవర్నర్ గారు అంటూ నినాదాలు చేశారు.

జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతున్న క్రమంలోనే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పక్షనేత యడ్యూరప్పకి అపాయింట్ మెంట్ ఇచ్చారు. కర్నాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి.. ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వొచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మే 17వ తేదీ ఉదయం 11.30గంటలకు ప్రమాణస్వీకారం చేస్తానని యడ్యూరప్ప స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బలనిరూపణకి గడువు ఇవ్వనున్నారు.

Posted in Uncategorized

Latest Updates