కర్నాటక రాజకీయం : సిద్దూ పంచ్ లతో బీజేపీ విలవిల

sdఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కర్ణాటకలో మాటల యుధ్ధం కొనసాగుతుంది. బిజెపి, కాంగ్రెల మాటల తూటాలతో కర్ణాటకలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. అందరికీ అర్థం అయ్యే భాషలో సిద్ధూ ఇచ్చిన పంచ్ ల కర్నాటక బీజేపీని ఇరుకున పెడుతున్నాయి.

కర్ణాటకలో రాజకీయాలు విలువలతో చేయాలంటూ మోడీకి పంచ్ ఇచ్చారు. అది ఎలాగంటే అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మోడీది ప్రధాని స్ధాయి కాదంటున్నారు సిద్దూ. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న 9 సంవత్సరాల్లో లోక్ యుక్త వ్యవస్థ లేదని.. అలాంటి వ్యక్తి కర్నాటకలో లోక్ పాల్ పై మాట్లాడటానికి అర్హత ఉందా అని నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులిచ్చారని తెగ ప్రచారం చేసుకుంటున్నారని, రాష్ట్రం నుంచి వెళ్లిన ట్యాక్స్ లే తిరిగి పంపిచారని లెక్కలతో బీజేపీకి చుక్కలు చూపించారు. మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చి ఉంటే చెప్పడంటూ బీజేపీపై నేరుగా సెటైర్లు వేశారు. కర్నాటక రాష్ట్రానికి 94వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం 84వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. అంటే మన కర్నాటక సొమ్మే మోడీ దగ్గర 10వేల కోట్లు ఉందంటూ చురకలు అంటించారు. ఇక అమిత్ షా ను ఓ మాజీ జైలు పక్షిగా వర్ణించారు. రాష్ట్రంలోని మరో జైలు పక్షి ఉందని.. ఈ ఇద్దరినీ అడవిలోకి పంపించాలంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు.

మోడీ పర్యటన తర్వాత కూడా బీజేపీలో ఊపు కనిపించకపోగా.. కాంగ్రెస్ ఎదురుదాడి పెంచటంతో కమలం పార్టీలో కంగారు మొదలైంది. కాంగ్రెస్ ఎప్పుడూ లేని విధంగా దూకుడు ప్రదర్శిస్తుండటంతో.. మరిన్ని మోడీ, అమిత్ షా టూర్లు ఉండొచ్చని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

Posted in Uncategorized

Latest Updates