కర్నాటక షెడ్యూల్ : మే 12న ఒకేసారి పోలింగ్

karnataka-Electionsకర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 12వ తేదీ పోలింగ్ జరగనుంది. 224 సీట్లకు ఒకేసారి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మే 15వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మే 29వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది. మార్చి 27వ తేదీ మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల ప్రధానాధికారి ప్రకాశ్ రావత్ ప్రకటించారు.

ఏప్రిల్ 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఏప్రిల్ 24వ తేదీ నామినేషన్ దాఖలుకి చివరి తేదీ. ఏప్రిల్ 25 నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 27న ఉపసంహరణ ఆఖరి తేదీ. కర్నాటకలో మొత్తం ఓటర్లు 4కోట్ల 96 లక్షల మంది. 56వేల 696 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తున్నారు. 2013 ఎన్నికల కంటే 9శాతం అదనం ఇవి.

Posted in Uncategorized

Latest Updates