కర్నాటక స్పీకర్ గా రమేష్ కుమార్ ఏకగ్రీవం

spekarకర్నాటక అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో తన అభ్యర్థిని బరి నుంచి ఉపసంహరించుకున్నది బీజేపీ. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తరపున బరిలోకి దిగిన రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు ప్రొటెం స్పీకర్. ఆ తర్వాత రమేష్ కుమార్ ను సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప ఇద్దరూ ఆయన్ను స్పీకర్ స్థానం దగ్గరకు తీసుకెళ్లారు. కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. సభలో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమికి 115 సభ్యుల బలం ఉంది. బీజేపీ బలం 104. మెజార్టీ మార్క్ 111. దీంతో స్పీకర్ ఎన్నిక సమయంలోనే తప్పుకున్న బీజేపీ.. బల నిరూపణకు సజావుగా సాగిపోతుందనే సంకేతాలు ఇచ్చేసింది.

స్పీకర్ రమేష్ కుమార్ సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అంతకు ముందే SM కృష్ణ సీఎంగా ఉన్న సమయంలో స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉంది. 18 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ స్పీకర్ గా ఎన్నిక అయ్యారు. శ్రీనివాసపురం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates