కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

bus-autoకర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదివారం(జూన్-24) ఉదయం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె దగ్గర జరిగిన ప్రమాదంలో ఆటో నుజ్జునుజయింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు.. 108కు కాల్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. మృతదేహాలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరు ఆటోలో మహానందికి వెళ్తున్నారని సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

Posted in Uncategorized

Latest Updates