కలల ‘స్పేస్‌ షిప్‌’ ఎగిరింది.. స్పేస్ టూరిజానికి నాంది

సమయం పొద్దున ఏడు గంటలు. కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలో ఓ సమూహం దేనికోసమో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతలోనే రివ్వున గాల్లోకి ఎగసిన రెండు భారీ విమానాలు, ఆకాశంలోకి దూసుకెళ్లాయి. చూస్తుండగానే వాటితో పాటు తీసుకెళ్లిన స్పేస్‌ షిప్‌ ను గాల్లోకి జారవిడిచాయి. రెండు సెకన్లలో మేల్కొన్న షిప్‌ పైపైకి దూసుకెళ్లి, తిరిగొచ్చి ఎడారిలో సేఫ్‌ గా ల్యాండయింది. దీంతో ఓ వ్యక్తి ఎగిరి గంతేశారు. తన ఇరవై ఏళ్ల కల నెరవేరిందంటూ పండుగ చేసుకున్నారు. ఆయనే రిచర్డ్‌‌ బ్రాన్‌ సన్‌ .‘వర్జిన్‌ గెలాక్టిక్‌‌’ కంపెనీకి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. అంతరిక్షానికి మనుషుల్ని తీసుకెళ్లి, మళ్లీ వెనక్కు తీసుకురావాలనేది బ్రిటన్‌ కు చెందిన బ్రాన్‌ సన్‌ కల. ఇందుకోసం 2004లో వర్జిన్‌ గెలాక్టిక్‌‌ను స్థాపించి కమర్షియల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌‌ తయారీలో నిమగ్నమయ్యారు.

నేడు ఫలితం

బ్రాన్‌ సన్‌ 14 ఏళ్ల శ్రమకు గురువారం ఫలితం దక్కింది. ఒక నిమిషం పాటు నింగిలోకి(82.7 కిలోమీటర్లు) ఎగిరిన స్పేస్ క్రాఫ్ట్‌‌, కంపెనీ లక్ష్యాలన్నింటిని అందుకుంటూ ధ్వనికి మూడు రెట్ల వేగంతో కిందికి దిగింది. ఈ సమయంలో ఇద్దరు పైలట్లు స్పేస్‌ క్రాఫ్ట్‌‌లో ఉన్నారు. ఫ్లైట్‌ టేకాఫ్‌ మొదలుకుని, స్పేస్‌ క్రాఫ్ట్‌‌ ల్యాండింగ్ వరకూ మొత్తం టెస్టుకు 14 నిమిషాలు పట్టింది. వర్జిన్‌ టెస్టు చేస్తున్న ‘స్పే స్‌ షిప్‌ 2’లో మొత్తం ఎనిమిది మంది(ఇద్దరు పైలట్లతో కలిపి) పడతారు. స్పేస్‌ టూరిజం కోసం దీన్ని తయారు చేశారు. అంతరిక్షంలో ఆర్బిటాల్ వరకూ తీసుకెళ్లి మళ్లీ వెనక్కు తీసుకొస్తారు. ఇప్పుడు చేసిన ప్రయోగం జస్ట్‌‌ శాంపిల్‌ మాత్రమే. ఒరిజినల్‌ స్పేస్‌ ఫ్లైట్‌ గంటన్నర పాటు ఉంటుంది. ఇందుకుగానూ ఒక్కరికి 1.8 కోట్లు వసూలు చేస్తారు. ఇప్పటికే అమెరికాకు చెందిన 600 మంది వర్జిన్‌ నుంచి టికెట్లను కూడా కొనేశారు. 2019లో అంతరిక్షానికి తొలి కమర్షియల్‌ ఫ్లైట్‌ ను వర్జిన్‌ రన్‌ చేయనుంది. అమెజాన్‌ యజమాని బెఫ్‌ బెజోస్‌ కు చెందిన ‘బ్లూ వన్‌ ’ కంపెనీ కూడా స్పే స్‌ టూరిజం కోసం ఓ ఎయిర్‌ క్రాఫ్ట్‌‌ను సిద్ధం చేసే పనిలో ఉంది.

Posted in Uncategorized

Latest Updates