కలాంకు వెబ్‌సైట్‌ అంకితం

ఢిల్లీ: ‘ది కలాం విజన్‌- డేర్‌ టు డ్రీమ్‌’ పేరిట రూపకల్పన చేసిన వెబ్‌సైట్‌ను దివంగత మాజీ రాష్ట్రపతి, భారత క్షిపణి పితామహుడు అబ్దుల్‌కలాంకు సోమవారం అంకితమిచ్చారు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌. ఈ డీఆర్‌డీవో వెబ్‌సైట్‌ కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ విద్యార్థులు, అంకురపరిశ్రమలకు చెందిన వారికి ఇది విస్తృతంగా ఉపయోగపడుతుందన్నారు. అబ్దుల్‌కలాంను తాను కలుసుకున్నప్పటి జ్ఞాపకాలను ఆమె నెమరేసుకున్నారు. ఈ వెబ్‌సైటు drdo.gov.in/drdo/kalam/kalam.html పై అందుబాటులో ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates