కలుద్దామని ఖతం చేశాడు.. ముంబైలో మోడల్ దారుణ హత్య

ముంబై : మహానగరం ముంబైలో దారుణం జరిగింది. ఓ అప్ కమింగ్ మోడల్ ను చంపేసి …. ఆ తర్వాత బాడీని సూట్ కేస్ లో చుట్టి… జనంలేని ప్రాంతంలో పడేసి పారిపోయాడు. మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఓ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు జరిపారు. మోడల్ ను చంపిన విద్యార్థి ముజమ్మిల్ సయ్యద్ ను అరెస్ట్ చేశారు.

మోడల్ మాన్సీ దీక్షిత్ ను ఎవరో హత్య చేసి చంపేశారన్న విషయం రెండురోజుల తర్వాత బయటకు వచ్చింది. మాన్సీ హత్య సోమవారం(అక్టోబర్ 15) జరిగింది. ముంబైలోని వెస్టర్న్ సబర్బన్ లోని మలాద్ లో చుట్టాల వాళ్లింటి వైపు వెళ్లిన మాన్సీ దీక్షిత్ వెళ్లింది. అక్కడే ముజమ్మిల్ సయ్యద్ అనే 19 ఏళ్ల విద్యార్థితో మాట్లాడింది. ఆ టైమ్ లో గొడవ జరిగిందని… ఈ గొడవతోనే ఆ యువకుడు ఆమెను చంపేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది.

మాన్సీని చంపిన తర్వాత.. ఆమెను ఓ సూట్ కేస్ లో ఇరికించి పెట్టాడు నిందితుడు. ఆ తర్వాత ఓ క్యాబ్ బుక్ చేసి… కమర్షియల్ కాంప్లెక్స్ అయిన మైండ్ స్పేస్ కు దూరంగా జనసంచారం లేని ప్రాంతంలో ఆ సూట్ కేస్ ను పడేశాడు. క్యాబ్ డ్రైవర్ కు డౌట్ వచ్చి.. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు అతడి సమాచారం ఆధారంగా స్పాట్ కు వెళ్లి సూట్ కేస్ ఓపెన్ చేసి … డెడ్ బాడీ గుర్తించి.. శవపరీక్ష జరిపారు. మిస్సింగ్ కేసు డీటెయిల్స్ మ్యాచ్ కావడంతో.. మాన్సీ దీక్షిత్ గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో… నిందితుడు సయ్యద్ ను అరెస్ట్ చేశారు.

20 ఏళ్ల మాన్సీ దీక్షిత్ రాజస్థాన్ కు చెందిన అమ్మాయి. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలనే ఉద్దేశంతో ముంబైకి వచ్చింది. చదువుకుంటూనే… మోడలింగ్ చేస్తోంది. ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ఆమెను హత్య చేసిన ముజమ్మిల్ హైదరాబాద్ నుంచి వచ్చాడని పోలీసులు చెప్పారు. వీరిద్దరికి ఇంటర్నెట్ లో పరిచయం అయిందని పోలీసులు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు కలుసుకోవాలని అనుకున్నారని.. మీట్ అయిన ప్రాంతంలోనే ఇద్దరికీ గొడవ అయ్యిందని చెప్పారు. ఈ గొడవలోనే ఆమెను తలపై కొట్టి.. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడని వివరించారు. చంపడమే కాదు.. సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు ట్రై చేశాడని వివరించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates