కలెక్టర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

 మధ్య ప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లా కలెక్టర్ గణేశ్ ను బదిలీ చేయిస్తానని బెదిరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి. మీకు నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ ఉండే అర్హత ఉందన్నారు. శనివారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసిన వారిలో గణేశ్ పేరు కూడా ఉంది. విజయోత్సవ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి కళావతి మాట్లాడారు. “ ప్రజలకు అనుగుణంగా గణేశ్ పనిచేయడం లేదు. అలిరాజ్ పూర్ జిల్లాలో ఆయన నాలుగు రోజులు మాత్రమే ఉంటారు. ఈ ఉన్న నాలుగు రోజులు ఇక్కడి అన్నం తిని హాయిగా ఉండు” అని కళావతి అన్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న గంటల వ్యవధిలో కలెక్టర్ గణేష్ బదిలీ అయ్యారు. కళావతి మేనమామ మధ్యప్రదేశ్ లోని రత్లాం ఎంపీగా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates