కలెక్షన్ కింగ్ శాపనార్థాలు : పైరసీ చేసినోళ్లు, చూసేవాళ్లు నికృష్ఠులు

gayathri'కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కస్సుబుస్సు లాడారు. గాయత్రి సినిమా విషయంలో నా మనస్సు ఏడుస్తుందని బాధపడ్డారు. సినిమాను పైరసీ చేశారని.. వారి పాపానికి వాళ్లు ఈ భూమిపైనే అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టారు. పైరసీ చేసినవాళ్లకీ కుటుంబం ఉంటుందన్నారు. నిర్మాతగా తొమ్మిది నెలలు కష్టపడి పని చేశారని.. ఒళ్లు హూనం చేసుకుని సినిమా తీశానని చెప్పుకొచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇటీవల వచ్చిన గాయత్రి సినిమాను పైరసీ చేశారన్నారు. ఆ దొంగలకు వార్నింగ్ ఇచ్చారు.

పైరసీ అనేది నీచమైన పని అని.. తెలియని శక్తి వాళ్లను నాశనం చేస్తుందని తిట్టిపోశారు. దయచేసి ఎవరూ పైరసీని చూడొద్దని విన్నవించుకున్నారు. పైరసీ చేసినోళ్లు, చూసినోళ్లు నికృష్ఠులు అన్నారు. అలాంటి వారిని తెలియని శక్తి.. నాశనం చేస్తుందని శపించారు. దయచేసి ఎవరూ పైరసీ చూడొద్దని రిక్వెస్ట్ చేశారు. ఎంతో కష్టపడి సినిమా చేశామని.. పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ అంతా నాశనం అవుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates