కల్తీ విత్తనాలు అమ్మితే కఠిర చర్యలు : ఈటల

Etela-Rajenderకల్తీ విత్తనాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్. రైతు సమస్యలను తీర్చేందుకే 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, పంట పెట్టుబడి పథకాలు తెచ్చినట్లు… ఆయన కరీంనగర్ లో చెప్పారు. రైతు చనిపోతే.. ఆ కుటుంబం రోడ్డునపడకుండా ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకాన్ని తెస్తున్నామని ఈటెల అన్నారు. త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసి ప్రతీఎకరాకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరీంనగర్ సుందరీకరణలో భాగంగా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఈటెల తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates