కల్యాణ్ రామ్ సస్పెన్స్ లో పెట్టేశాడు.. 118 టీజర్

టాలీవుడ్ ‘పటాస్’  నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్ ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ తోనే ఏదో మిస్టీరియస్ ఫీల్ తెప్పించిన 118 ముూవీ… టీజర్ తో ఆ క్యూరియాసిటీని మరింత పెంచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోందన్న సంగతిని… టీజర్ తో మరోసారి క్లారిఫై చేసేశారు. టీజర్ ను చూస్తే… కల్యాణ్ రామ్, షాలినీపాండే ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తుంటారు. ‘ఆ రోజ్ వరకు’ అనే బ్యాంగ్ తో… టీజర్ లో వేరియేషన్ వస్తుంది.  ఓ అర్ధరాత్రి వాళ్ల లైఫ్ ను మార్చేస్తుంది. తన జీవితం, తనవాళ్ల జీవితానికి షాకిచ్చిన ఓ విషయం గురించి కల్యాణ్ రామ్ వెతుకుతుంటాడు. 1:18 సమయం బ్లింక్ అవుతుంది. ఆ సమయానికి… సినిమా టైటిల్ కు లింక్ ఉంటుందన్న సంగతి అర్థమవుతుంది. ఆ మిస్టరీ ఏంటన్నదే మూవీపై ఆసక్తి పెంచుతోంది.

టీజర్ లో నివేతా థామస్ ను చూపించలేదు. నివేతాది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చిత్రయూనిట్ చెబుతోంది. శేఖర్ చంద్ర టీజర్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ బాగుంది. కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిినిమాను.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. మహేశ్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates