కల నెరవేరింది : 70 ఏళ్లు కష్టపడి.. బెంజ్ కారు కొన్న రైతు

మనం కోరుకున్నది దక్కినప్పుడు కలిగే ఆనంనానికి అవధులుండవు. కానీ మనకు కావాల్సింది తల్లిదండ్రులు కొనిచ్చినప్పుడు కంటే మన కష్టార్జితంతో కొనుక్కుంటే సంతోషంగా ఉంటుంది. తమిళనాడుకు చెందిన ఓ రైతు పడుతున్న ఆనందం ఇదే. ఎనిమిదేళ్ల వయసులో చూసిన బెంజ్ కారును ఎంతో కష్టపడి 88 ఏళ్ల వయసులో కొనుక్కున్నాడు. దాంతో అతని ఆనందానికి అంతులేదు.

తమిళనాడులోని కాంచీపురానికి చెందిన దేవరాజన్‌ వ్యవసాయం చేస్తుంటాడు. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఎనిమిదేళ్ల వయసులో రాజన్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు చూసి అది కావాలనుకొన్నాడు. అప్పట్లో అతనికి ఆ కారు పేరు కూడా తెలీదు. కానీ ఆ కారుని చూడగానే ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నాడు. అందుకు చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుంటూ రూ.33 లక్షలు పెట్టి బెంజ్ కారు కొని తన కలను నెరవేర్చుకున్నాడు.

చిన్నప్పుడు ఎక్కడికి వెళ్లలన్నాఅతను సైకిల్‌ మీదే వోళ్లేవాడు. ఓసారి అతను 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బెంజ్‌ కారును చూశాడు. “నా జీవితంలో అలాంటి కారును చూడటం అదే మొదటిసారి. కనీసం ఆ కారు పేరు కూడా నాకు తెలీదు. కారు లోగో నాకు చాలా నచ్చింది. దాంతో ఎప్పటికైనా ఆ కారును సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు నా కల నెరవేరింది. కారును సొంతం చేసుకోగలిగాను. ఈ క్రెడిట్‌ అంతా నా భార్యదే” అన్నాడు ఆ రైతు రాజన్‌. రాజన్‌ కథ గురించి తెలిసి బెంజ్‌ షోరూం డీలర్లు ఎంతో ముచ్చటపడ్డారు. జీవితంలో ఎంతో కష్టపడి మొత్తానికి అనుకున్నది సాధించినందుకు గానూ షోరూం డీలర్లు కేక్‌ తెప్పించి సెలబ్రేట్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates