కళ్లద్దాలతో ఫోన్‌ కాల్స్‌

గూగుల్‌ సహా అనేక టెక్నాలజీ సంస్థలు ‘స్మార్ట్‌ ’ కళ్లద్దాల్ని తయారు చేశాయి. అయితే అవి ఇతర గ్యాడ్జెట్స్‌లా ఎక్కువ ఆదరణ పొందలేకపోయాయి. అయినా వీటికి సంబంధించి ప్రయోగాలు మాత్రం ఆగడం లేదు. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు మరింత మెరుగైన కళ్లద్దాల్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ‘బోస్‌ ’ సంస్థ మరో కొత్త రకం సన్‌ గ్లాసెస్‌ ను రూపొందించింది . ఈ కళ్లద్దాలతో ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్‌ ఫ్రేమ్స్‌ లోపల ఒక చిన్న మైక్రోఫోన్‌ , స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. వీటి ద్వారా ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవచ్చు. మ్యూజిక్‌వినేందుకు కూడా స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతుంది . ఏఆర్‌‌‌‌‌‌‌‌ (ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ) టెక్నాలజీతో, అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌, సిరితో అనుసంధానమై ఇవి పనిచేస్తాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర పదిహేను వేల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. చూడటానికి ఇవి సాధారణ సన్‌ గ్లాసెస్‌ లాగే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు. యూవీ కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి. ఒక్కసారి బ్యాటరీ చార్జ్‌‌‌‌‌‌‌‌ చేస్తే 12 గంటల వరకు పనిచేస్తుంది .

Posted in Uncategorized

Latest Updates