కళ్లు తిరిగిపోయాయి : బ్యాడ్మింటన్ కోర్టు లాకర్లలో వందల కోట్లు

బెంగళూరు నగర నడిబొడ్డులోని 150 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ క్లబ్ బోరింగ్ ఇనిస్టిట్యూట్ బ్యాడ్మింటన్ కోర్టులోని మాడు లాకర్లలో వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. కోట్లలో డబ్బు కూడా బయటపడింది. అక్కడి లాకర్లలో క్రీడాసామాగ్రి పెట్టుకోవడానికి సభ్యత్వం ఇస్తారు. ప్రతి ఏటా లాకర్ తీసుకున్న సభ్యుడు తన సభ్యత్వాన్ని పొడిగించుకోవాల్సి ఉంటుంది. అయితే క్లబ్ నుంచి ఎన్నిసార్లు పిలుపువెళ్లినా పారిశ్రామికవేత్త అవినాశ్ అమర్ లాల్ కుఖ్రేజా వెళ్లలేదు. కనీసం స్పందించనూ లేదు.

దీంతో గురువారం(జులై-19) న లాకర్ ను ఓపెన్ చేసిన మెనేజ్ మెంట్ కి అన్నీ 2వేల రూపాయలతో 3.9 కోట్ల రూపాయులున్న ఆరు బ్యాగులు బయటపడ్డాయి. అదే విధంగా 7.8 కోట్లు విలువైన 650గ్రాముల గోల్డ్ బిస్కెట్లు, డైమండ్ జ్యూయలరీ, రెండు లగ్జరీ వాచ్ లు, వందల కోట్లు విలవ చేసే రియల్ ఎస్టేట్ డీల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్లు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. విచారణ ప్రారంభించిన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.. ఈ లాకర్లు బెంగళూరు నగరానికి చెందిన వ్యాపారవేత్త అవినాశ్ అమర్‌ లాల్ కుఖ్రేజా(46)కు చెందినవిగా ప్రకటించారు. కొన్నేళ్లుగా లాకర్ ఉపయోగించుకుంటున్న అవినాష్.. రూల్స్ ప్రకారం రెన్యువల్ చేసుకోలేదు. లాకర్ ఉపయోగించుకునే విధానంలో రూల్స్ కూడా పాటించలేదు. దీనిపై బ్యాడ్మింటన్ క్లబ్.. పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. చివరికి అతని బండారం ఇలా బయటపడింది.

Posted in Uncategorized

Latest Updates