కవిత గ్రీన్ ఛాలెంజ్ : మొక్క నాటిన జక్కన్న

హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత ఛాలెంజ్ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె ఛాలెంజ్ ను స్వీకరుస్తున్నారు. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో గ్రీన్ ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రముఖులు వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా  డైరెక్టర్ రాజమౌళి .. ఎంపీ కవిత విసిరిన ఛాలెంజ్ స్వీకరించారు. మంగళవారం (జూలై-24) మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి ఈ ఛాలెంజ్ ని పుల్లెల గోపిచంద్, KTR, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లకి విసురుతున్నట్టు తెలియజేశారు. తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ రాజమౌళి ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన RRR మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates